Beauty Tips

Skin allergy:స్కిన్ ఎలర్జీ తో బాధపడుతున్నారా…ఈ ఇంటి చిట్కాలు మీకోసమే

skin allergy Home Remedies:స్కిన్ ఎలర్జీ వచ్చిందంటే చర్మ ఎర్రగా మారటం,దురదలు, వాపులు వచ్చి విపరీతమైన సమస్యలకు గురి చేస్తాయి. సమస్య పెద్దగా ఉంటె మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. అదే సమస్య తీవ్రత తక్కువగా ఉంటే ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్దమైన లక్షణాలను కలిగి ఉన్న కొబ్బరి నూనె స్కిన్ ఎలర్జీకి మంచి ఉపశమనం కలిగిస్తుంది. దురదలు ఉన్న ప్రదేశంలో కొబ్బరినూనె రాస్తే ఉపశమనం కలుగుతుంది.

స్కిన్ ఎలర్జీ ఉన్న ప్రదేశంలో ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్ మరియు కొబ్బరి నూనె రెండింటిని కలిపి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా చేసిన తరువాత ప్రభావిత ప్రాంతాన్ని వేడి గుడ్డతో చుట్టాలి, చర్మం నూనెను గ్రహించుకున్న తరువాత గుడ్డను తీసేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.