smartphone side effects:స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా….రిస్క్ లో పడినట్టే
smartphone side effects In Telugu :ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేనిదే ఏ పని జరగటం లేదు. నేటి అవసరాలు, ఆధునిక టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్ ను పక్కన పెట్టే పరిస్థితి లేదు.
అయితే స్మార్ట్ ఫోన్ ని రెండు గంటలకు మించి వాడితే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి జీవితంలో స్మార్ట్ ఫోన్ అనేది ఒక భాగంగా మారిపోయింది.
తలను ముందుకు వంచి స్మార్ట్ ఫోన్ ను చూస్తున్న సమయంలో మెడపై భారం విపరీతంగా పెరుగుతుంది. 30 డిగ్రీల కోణంలో మెడ వంచినప్పుడు వెన్ను ఎముకపై 18 కిలోలంత భారం పడుతుంది. దీర్ఘకాలం పాటు ఈ స్థాయిలో భారం కొనసాగితే వెన్నుపాములో డిస్క్ ల అరుగుదల (కణజాల క్షీణత) చాలా తొందరగా మొదలువుతంది.
వృద్ధాప్యం రాకముందే, నడి వయసులోనే వెన్నెముక సర్జరీలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది . అందువల్ల మెడ భాగం ముందుకు వంగకుండా, వెన్నెముకను ఎప్పటిలానే తటస్థంగా ఉంచుతూ స్మార్ట్ ఫోన్ వాడుకోవటం అలవాటు చేసుకోవాలి.
స్మార్ట్ ఫోన్ వాడటం వలన దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో వస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఒసిప్టల్ న్యూరాల్జియా. ఇది నరాలకు సంబందించిన సమస్య. వెన్నుపూస పైభాగం నుంచి వెళ్లే నరాలు తీవ్రమైన ఒత్తిడికి గురై వాపుకు గురవుతాయి. ఇలా వాపుకు గురి అయ్యినప్పుడు తీవ్రమైన తలనొప్పి వచ్చి మైగ్రేన్ కి దారి తీస్తుంది.
ఈ తలనొప్పి వస్తే తొందరగా తగ్గదు. స్మార్ట్ ఫోన్ పక్కన పెట్టేసి మందులు వాడుతూ విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుట వలన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి విడుదలయ్యే నీలి కాంతి కంటిలోని రెటీనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.
దాంతో ఆ ప్రభావం కంటి చూపు మీద పడి కంటి చూపు తగ్గుతుంది.అంతేకాక కంటికి సంబంధించి సమస్యలు వస్తాయి. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్న వారు తరచూ తలనొప్పి, కళ్లు మంటలకు గురవుతుంటే అదొక ముందస్తు హెచ్చరికగా భావించాలి.
ఇక కంటి చూపులో తేడా వచ్చిందంటే ఫోన్ ను కాల్స్ కు తప్ప దేనికీ ఉపయోగించకుండా పక్కన పెట్టేసి వైద్యులను సంప్రదించటం చాలా మంచిది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


