Devotional

Deeparadhana:దీపారాధన చేయడానికి ఏ నూనెను ఉపయోగించాలి?

Benefits Of Deeparadhana :హిందువులు పూజ చేసే సమయంలో దీపారాధన చేస్తూ ఉంటారు ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మనలో దాగిఉన్న దైవిక శక్తి మేల్కొంటుంది అలాగే శారీరక మానసిక బలం కూడా కలుగుతుంది దీపం పెట్టి దైవాన్ని ప్రార్ధిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఒక నమ్మకం.

అయితే దీపారాధన చేసినప్పుడు ఏ నూనె వాడాలి అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అలాగే ఏ ఒత్తి వెలిగిస్తే శుభాలు కలుగుతాయి తెలుసుకుందాం.
తామర కాడ తో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వ జన్మలో చేసిన పాపాలు అన్ని తొలగిపోతాయి.

తెల్లటి వస్త్రం మీద పన్నీరు జల్లి ఆరబెట్టి ఆ తర్వాత ఆ వస్త్రంతో వత్తులు చేసి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన శనీశ్వరునికి శుభం.

వేప నూనె విప్ప నూనె ఆవు నెయ్యి తో దీపారాధన చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఆవు నెయ్యి విప్ప, వేప ఆముదం కొబ్బరి నూనె మిశ్రమంతో నలభై ఒక్క రోజుల దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి

వినాయకునికి నువ్వుల నూనె దీపం, లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపం పెడితే మంచిది. దీపం వెలిగించే టప్పుడు దీపం కింద తమలపాకు లేదా ప్లేట్ తప్పనిసరిగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.