Beauty Tips

Hair Care Tips:జుట్టు కాంతివంతంగా మెరవాలంటే…ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Hair Care Tips:శిరోజాలు అందవిహీనంగా ఉంటే ముఖారవిందం దెబ్బతింటుంది. మనం అందంగా మరియు ఆకర్షణీయంగా కనపడాలంటే ముఖ అందంతో పాటు శిరోజాల అందం కూడా ముఖ్యం అని చెప్పవచ్చు. ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే జుట్టును ఎలా అందంగా ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము.

ఆలివ్ లేదా బాదం నూనెను బాగా వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నూనెను జుట్టు లోపలి దాక పట్టించి రెండు గంటల పాటు వదిలివేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది. రాత్రి సమయంలో నూనెను అప్లై చేసినట్లైతే మరింత మంచి పలితాన్ని పొందవచ్చు.

తలస్నానానికి ఒక గంట ముందు వెనిగర్ లేదా ఆపిల్ సైడర్ వెనిగర్ ను జుట్టు లోపల వరకు బాగా పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయాలి. వెనిగర్ శిరోజాలకు మరింత మెరుపును ఇస్తుంది.

రోజుకో హెయిర్ స్టైల్ మార్చటం వలన కూడా జుట్టు అందం దెబ్బతినటానికి కారణం అవుతుంది. ఒక్క స్టైల్ నే కొన్ని రోజుల వరకు కొనసాగించాలి. ప్యాషన్ మారిందని హెయిర్ స్టైల్ మారుస్తూ పొతే చివరికి జుట్టే లేకుండా పోయే ప్రమాదం ఉంది.

దువ్వుకొనే దువ్వెన,తలస్నానం అనంతరం జుట్టును అరబెట్టుకొనే పరికరాలు అన్నీ నాణ్యమైనవి ఉండాలి. తలస్నానం చేసిన తర్వాత వెడల్పాటి పళ్ళు ఉన్న దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. నెలకు ఒకసారి హెయిర్ స్పా చేయించుకొంటే మంచిది.

గుడ్డుసోనలో కొంచెం తేనే వేసి కలిపి జుట్టు కుదుళ్ళ నుండి చివర వరకు పట్టించాలి. ఆరిన తర్వాత తేలికపాటి షాంపు తో స్నానం చేయాలి. ఈ విధంగా చేసినట్లైతే జుట్టు మెరుస్తూ,నిగనిగలాడుతూ ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.