Devotional

Importance Of Pearl:ముత్యం ఎవరు ధరించాలి…ఎలాంటి ఫలితాలు కలుగుతాయో..?

pearls benefits in telugu :పైకి అందరూ జ్యోతిష్యం,జాతకం అంటూ విమర్శలు చేసినప్పటికీ తీరా దీని గురించి తెలుసుకుని ఆసక్తి కనబరిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. సెంటిమెంట్స్ కూడా ఎక్కువే మనవాళ్లకు. అందుకే ఏ రాయి ధరిస్తే మంచిదని జాతకం చూపించుకుని మరీ ఉంగరంలో గానీ, గొలుసులో గానీ సదరు రంగు రాయిని ధరిస్తారు.

ఇక ముత్యం గురించి చెప్పక్కర్లేదు. ముత్యాల హారం, ముత్యాల తలంబ్రాలు ఇలా ఎన్నో రకాలుగా ముత్యాన్ని వాడతారు. మంచి ముత్యాల కోసం వేట కూడా చేస్తారు. అయితే శ్వేత వర్ణంలో మెరిసే ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలామంది భావన.

దీనికి తోడు ముత్యం ధరిస్తే వ్యతిరేక ప్రభావాలు కూడా అస్సలు ఉండవు.ముఖ్యంగా మీన,సింహ,ధనుస్సు రాశుల వాళ్ళు ముత్యం ధరిస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. చాలామంది బంగారు ఉంగరంలో ముత్యం ధరిస్తారు.

కానీ వెండితో చేసిన ఉంగరంలో ముత్యం పొదిగి ధరిస్తే శ్రేయస్కరమని అంటున్నారు. కోపతాపాలు తగ్గి, మనసు ప్రశాంతంగా, పాజిటివ్ థింకింగ్ తో ఉంటుందని చెబుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.