Beauty Tips

Dry Skin:పొడి చర్మానికి చెక్ పెట్టాలంటే…ఈ ప్యాక్ ట్రై చేయండి

Dry Skin Remedies:చర్మం పొడిగా ఉంటే చర్మం గరుకుగా,కాంతివిహీనంగా ఉండి మృదుత్వాన్ని కోల్పోతుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది పొడి చర్మం సమస్యతో బాధపడుతున్నారు. చర్మంలో తేమ తగ్గటం వలన పొడిగా మారుతుంది.

చర్మం పొడిగా మారగానే మనలో చాలా మంది రకరకాల క్రీమ్స్ ని మార్కెట్ లో కొనుగోలు చేసి వాడేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు అవుతుంది కానీ ఫలితం కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఆలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే ఆ ఫలితం ఎక్కువరోజులు ఉంటుంది.

అరటిపండు పండు పేస్ట్ లో కొంచెం పాలు కలిపి ముఖానికి రాసి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ చ‌ర్మానికి తేమ‌ను అందిస్తుంది.త‌ద్వారా పొడిబారిన చ‌ర్మం మృదువుగా మారుతుంది.

ఆపిల్ తొక్కలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో తేనే కలిపి ముఖానికి రాసి 2 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.