Allari Naresh Wife:అల్లరోడు భార్య ఏమి చేస్తుందో తెలుసా?
Allari Naresh Wife:E.V.V.సత్యనారాయణ రెండో కొడుకు నరేష్. నరేష్ అన్నయ్య ఆర్యన్ రాజేష్ కూడా హీరోనే. కానీ పెద్దగా సక్సెస్ కాలేదు. నరేష్ అల్లరి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వటంతో అల్లరి నరేష్ గా మారాడు. చాలా తక్కువ సమయంలోనే తానేమిటో నిరూపించుకొని పాపులర్ అయ్యి చిన్న నిర్మాతలకు వరంగా మారాడు. 1982 జూన్ 30 న జన్మించిన నరేష్ చదువు అంతా చెన్నయ్ లోనే సాగింది.
నరేష్ నాన్న దర్శకుడు కావటం వలన అప్పట్లో సినీ పరిశ్రమ చెన్నయ్ లో ఉండుట వలన నరేష్ బాల్యం చెన్నె లోనే సాగింది. అయన వివాహం 2015 మీ 29 న హైదరాబాద్ లో చాలా వైభవంగా జరిగింది. నరేష్ పెళ్లి చెన్నయ్ కి చెందిన విరూపతో జరిగింది.
విరూప తల్లితండ్రులు చెన్నయ్ లోనే ఉంటారు. వారు ఉద్యోగ రీత్యా చెన్నయ్ లో సెటిల్ అయ్యారు.ఆమె సినిమాలు ఎక్కువగా చూడదట. అంతేకాక సినిమాల గురించి అసలు నాలెడ్జ్ కూడా అసలు లేదు. ఆమె పెళ్లి సమయానికి అల్లరి నరేష్ సినిమాల్లో ఒక్క సినిమా కూడా చూడలేదట.
ఆమె ఆర్కిటెక్ గా పనిచేస్తుంది. ఆమె సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఆ పనులతో బిజీగా ఉంటుంది. ఇప్పటివరకు నరేష్ నటించిన సినిమాల్లో ‘జేమ్స్ బాండ్’ సినిమా మాత్రమే చూసింది. ఆమె ఆర్కిటెక్ గా చాలా బిజీగా ఉండటంతో సినిమాలు చూసే సమయం ఉండదు. విరూప ఆంధ్రప్రదేశ్ లో విజయవాడకు చెందిన అమ్మాయి. ఈ వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం. వీరికి ఒక పాప. ఆ పాప పేరు Ayana Evika Edara.