Devotional

Rottern Coconut in Pooja :కుళ్ళిన కొబ్బరికాయ కొడితే ఎమౌంతుందో తెలుసా ?

Rottern Coconut in Pooja :మనం గుడికి వెళ్ళినపుడు, ఇంట్లో పూజ చేసినపుడు, పూజా సామాగ్రితో పాటు కొబ్బరికాయ, అరటిపళ్ళు పట్టుకెళ్లి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతాం. అయితే ఒక్కోసారి కొబ్బరికాయ కొట్టాక కుళ్లిపోయి ఉంటుంది. దాంతో అశుభం జరుగుతుందేమోనని కంగారు పడిపోతాం.

అయితే లోపల ఎలా ఉందొ తెలీకుండా కొబ్బరికాయ కొడతాం. అది కుళ్ళిందో, మంచిదో కొట్టిన తర్వాత కానీ తెలీదు. అందుకే అది దోషం కాదని పెద్దలు చెబుతారు. కాళ్ళు చేతులు కడుక్కుని మరో కొబ్బరికాయ తెచ్చి కొడితే సరిపోతుందని, దీనికి గాబరా పడిపోవాల్సిన అవసరం లేదని పండితులు చెబుతారు. ఇక వంకరగా మిగిలిందని, నిలువుగా మిగిలిందని బాధ పడిపోతుంటారు.

ఇది కూడా తప్పుకాదు. భక్తితో కొట్టామా లేదా అనేది చూడాలి తప్ప ఇలాంటివి పట్టించుకోకూడదు. పైగా నిలువుగా పగిలితే ఇంట్లో వారికి సంతాన యోగం కలుగుతుందట. గుండ్రంగా పగిలితే కోరికలు నెరవేరతాయట. వంకరగా పగిలిన నష్టం ఉండదని, ఇక మధ్యలో పువ్వు వస్తే శుభ సూచకమని, కొత్త దంపతులకు సంతాన యోగం ఉంటుందని పెద్దలు చెబుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.