MoviesTollywood news in telugu

Allu Arjun Wife:అల్లు అర్జున్ భార్య గురించి ఎవ్వరికి తెలియని నిజం

Allu Arjun Wife:టాలీవుడ్ లో యాక్టర్ ల యొక్క టాలెంట్ ముఖ్యం. వారు ఏమి చదివారనేది పెద్దగా పట్టించుకోరు. NTR,ANR కాలం నుండి ఇదే ఒరవడి కొనసాగుతుంది. అయితే ఇప్పటి జనరేషన్ కి వచ్చేసరికి సినీ పరిశ్రమలో ఉన్నత విద్యావంతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇంజనీరింగ్,మెడిసిన్ చదివినవారు కూడా టాలీవుడ్ వైపు ప్రయాణం చేస్తున్నారు.

సినిమాల మీద ఇష్టంతో చదువును అశ్రద్ధ చేసిన స్టార్ హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు. టాలీవుడ్ టాప్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు అర్జున్. 1983 ఏప్రిల్ 8 న మద్రాస్ లో జన్మించిన అల్లు అర్జున్ 18 సంవత్సరాల వరకు అక్కడే పెరిగాడు.

అక్కడ బాగా ఫెమస్ అయినా పద్మ శేషాద్రి స్కూల్ లో విద్యాభ్యాసం చేసాడు. స్కూల్ రోజుల్లోనే బన్ని చదువులో కాస్త పూర్. అందుకే చిన్నతనం నుండి జిమ్నాస్టిక్స్ నేర్చుకొని భవిష్యత్ కి బాటలు వేసుకున్నాడు. ఇప్పుడు బన్ని ఇంతలా డాన్స్ చేయటానికి ఆ జిమ్నాస్టిక్స్ కారణం అని చెప్పవచ్చు.

ఇంతకీ అల్లు అర్జున్ ఎంతవరకు చదివాడో తెలుసా? కేవలం పదోవ తరగతి వరకు మాత్రమే. కానీ నటన,డాన్స్,ఫైట్స్ విషయానికి వస్తే మాత్రం మాస్టర్ డిగ్రీ అందుకునట్టు లెక్క. ఎందుకంటే బన్ని నటించిన ఏ సినిమా చూసిన ఇట్టే అర్ధం అయిపోతుంది.

ఇక బన్ని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2011 లో స్నేహలత రెడ్డితో వివాహం అయింది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. స్నేహ పెళ్ళికి ముందు అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేసింది. ఇండియా వచ్చాక తన తండ్రి స్థాపించిన కాలేజ్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంది.

స్నేహ పెళ్ళయాక కూడా ఒక వైపు పిల్లలు అయాన్ .అర్హ లను చూసుకుంటూ మరో వైపు కాలేజ్ బాధ్యతలు,స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండేలా జూబ్లీ హిల్స్ లో సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది.

ఒక ఫోటో స్టూడియోను కొనుగోలు చేసి తన టెస్ట్ కి తగ్గట్టుగా బేబీ ఫొటోగ్రఫీ,మెటర్నటీ ఫొటోగ్రఫీ వంటి ఫీచర్స్ తో అద్భుతంగా రన్ చేస్తుంది స్నేహ. స్నేహ ఎంత పెద్ద చదువు చదివిన చాలా నిరాడంబరంగా ఉండటం తన ప్రత్యేకత. అమెరికాలో చదివిన పక్కా హిందూ సంప్రదాయాలను ఫాలో అవుతూ,భర్తను అత్తమామలను ఎలా గౌరవించాలో ఆలా గౌరవిస్తూ అచ్చ తెలుగు కోడలు పిల్లలా అందరిని మెప్పిస్తుంది.