Devotional

కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి ఎందుకు వస్తామో తెలుసా?

మన సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలను చాదస్తంగా కొందరు కొట్టిపారేస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ఆరోగ్య రహస్యాలు, శాస్త్రీయత ఉన్నాయని అంటుంటారు. కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నప్పటికీ చాలా వరకూ చాలా ముందు చూపుతో పెట్టినవేనని అంటారు.

అంతెందుకు ఎవరైనా ఇంటికి వస్తే, ఏదైనా చెడు జరిగితే ఏ పాదం రా బాబు అనుకోవడం వింటుంటాం. మరి పెళ్లి అయ్యాక కొత్త కోడలు ఇంటికి వచ్చినపుడు కుడిపాదం పెట్టి రా అమ్మా అని అంటారు. ఏ పాదమైతే ఏమిటే అనిపిస్తుంది. కానీ కుడిపాదం పెట్టడం వలన సకల శుభాలు, సంతోషం జరుగుతాయని నమ్మకం.

దీనికి ఉదాహరణ గా పురాణ కాలం నాటి అంశాన్ని కూడా పండితులు ప్రస్తావిస్తారు. సీతమ్మను రావణాసురుడు లంకకు తీసుకుని వెళ్ళినపుడు ఆమె జాడ కోసం వెతికే సమయంలో ఎడమ పాదం పెట్టి వెళ్ళాడట. అందుకే రావణ సంహారం జరిగిందని, ఎడమ పాదం అశుభ సూచకమని అంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.