Beauty Tips

Pimples:నిమ్మకాయ మొటిమల చికిత్సలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం

Pimples Home Remedies:నిమ్మకాయ నిజంగా మొటిమల చికిత్సలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. మనం అన్ని రకాల చర్మాల కోసం మరియు మొటిమల చికిత్స కోసం నిమ్మలో ఉన్న లక్షణాల గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలో ఉన్న ఆ లక్షణాల గురించి తెలుసుకుందాం.

1. ఎక్స్ ఫ్లోట్
సిట్రస్ కుటుంబానికి చెందిన నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటుంది. ఇది మొటిమల ప్రభావిత చర్మం ఎక్స్ ఫ్లోట్ కావటానికి సహాయ పడుతుంది. చర్మం యొక్క పొరలు ఊడి పోవటం అనేది మొటిమల చికిత్సలో ప్రధాన దశ. నిమ్మరసంను చర్మానికి రాస్తే చర్మ రంద్రాలకు అవరోదాలను తొలగించి దుమ్ము,మృత కణాలను తొలగిస్తుంది.

2. బ్యాక్టీరియాను చంపుతుంది
నిమ్మరసంలో సహజమైన యాంటీ బాక్టీరియల్ లక్షణం ఉంటుంది. అందువలన మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియాను చంపుతుంది. నిమ్మరసంలో ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ P సమృద్దిగా ఉండుట వలన మొటిమలకు కారణం అయిన బ్యాక్టీరియా వృద్ది చెందకుండా కూడా నిరోదిస్తుంది.

3. నయం చేసే లక్షణాలు
నిమ్మరసంలో నయం చేసే లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన, మోటిమలు కారణంగా వచ్చే వాపు మరియు ఎరుపుదనాన్ని తగ్గిస్తుంది.

4. బ్లీచింగ్ ప్రభావం
నిమ్మరసంలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. అందువలన మొటిమల కారణంగా వచ్చే మచ్చలను తగ్గిస్తుంది.

5. మొటిమలు తొందరగా తగ్గటానికి
నిమ్మరసంలో L- ఆస్కార్బిక్ ఆమ్లం ఉండుట వలన సహజమైన ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి మొటిమలు తొందరగా తగ్గటానికి నిమ్మరసం
సహాయపడుతుంది.

6. ఫ్రీ రాడికల్ మీద పోరాటం
నిమ్మకాయ రసంలో విటమిన్ C సమృద్దిగా ఉండుట వలన, అది యాంటి ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్ మీద పోరాటం చేస్తుంది. ఈ పోరాటం కారణంగా మొటిమలు తొందరగా విచ్చిన్నం అయ్యి త్వరగా తగ్గుతాయి. అంతేకాక చర్మం దోషరహితం మరియు ఆరోగ్యకరముగా మారుతుంది. అలాగే ఇది బ్యాక్టీరియాతో పోరాటం చేయుట వలన చర్మం బలంగా తయారవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.