Devotional

Lakshmi gavvalu:గవ్వలను పూజిస్తే ఏమి అవుతుందో తెలుసా…?

Lakshmi Gavvalu:మన సంప్రదాయంలో చెట్టుకీ, పుట్టకీ కూడా పూజ చేస్తాం. ముక్కోటి దేవతలు ఉన్నారని భావిస్తాం. ఇక సెంటిమెంట్స్ కూడా ఎక్కువే. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది సముద్రపు గవ్వల గురించి. వీటిని సాక్షాత్తూ లక్ష్మీదేవి సోదరి,సోదరులుగా భావించడం కూడా కొన్ని వర్గాల్లో ఆనవాయితీ.

గవ్వలను లక్ష్మీదేవి చెల్లెళ్లుగా, శంఖువు లను తమ్ముళ్ళుగా భావించి పూజ చేస్తుంటారు. కొత్తగా కట్టిన ఇంటి గుమ్మానికి గవ్వలను కడితే, లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ పూజ చేసి, గవ్వలు ఆడడం కూడా కొన్ని కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తోంది.

నగదు పెట్టెల్లో గవ్వలను ఉంచితే లక్ష్మీదేవి పదిలంగా ఉంటుందని, పూజా మందిరంలో ఉంచితే లక్ష్మీదేవి ఇంట తాండవిస్తుందని కూడా భావించి, ఇలా పూజలు నిర్వహిస్తుంటారు. నల్లని తాడుతో గవ్వ లను ఉంచి పిల్లల మెడలో వేస్తే, దుష్ట గ్రహాలు దరిచేరవని, దిష్టి తగలకుండా ఉంటుందని చెబుతారు.