Beauty Tips

Tips To Remove Blackheads:నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ తొలగిపోవాలంటే బెస్ట్ చిట్కా

Tips To Remove Blackheads:ముఖం ఎంత అందంగా ఉన్నా ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉన్నాయంటే మొఖం అందవిహీనంగా కనబడుతుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే బ్లాక్ హెడ్స్ అన్ని తగ్గిపోయి మళ్లీ మళ్లీ రాకుండా ఉంటుంది.

బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి బంగాళదుంప చాలా బాగా పనిచేస్తుంది.బంగాళదుంప బ్లాక్ హెడ్స్ నీ తొలగించడమే కాకుండా ముఖంలో ఉన్న జుట్టును కూడా తొలగిస్తుంది బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రబ్ చేయాలి. ఓ రెండు నిమిషాలు పాటు ఇలా చేశాక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

మెంతులు పసుపు ఈ రెండు యాంటీబ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన బ్లాక్ హెడ్స్ ని తొలగించడంలో చాలా పర్ఫెక్టుగా పని చేస్తాయి. అర స్పూన్ మెంతిపొడి లో ఒక స్పూన్ పసుపు కలిపి నీటితో మెత్తని పేస్టులా చేయాలి ఈ పేస్ట్ ను బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అరగంటయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు రోజులపాటు చేస్తే మంచి ఫలితం కనబడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.