MoviesTollywood news in telugu

Megastar chiranjeevi:చిరంజీవి కెరీర్ లో బెస్ట్ సినిమాలు… మీరు చూసారా…?

Megastar chiranjeevi Best Movies In Telugu : చిరంజీవి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ప్రాణం ఖరీదు మూవీతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి, తర్వాత విలన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా చేస్తూ, స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగి, మెగాస్టార్ గా మారాడు చిరంజీవి.

కలెక్షన్స్ పరంగా దుమ్మురేపుతూ, 60 ప్లస్ లో కూడా తన నటనతో కుర్ర హీరోలకు ధీటుగా నటిస్తున్నాడు. ఇంద్ర మూవీ 2002లో రిలీజై 27కోట్లు వ్యాపారం చేసింది.
ఇక అవినీతిపై సమరశంఖం పూరించిన ఠాగూర్ మూవీ 2003లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ కలెక్షన్స్ సాధించింది. జై చిరంజీవ మూవీ 2005లో విడుదలై, ఏవరేజ్ అయింది. దీంతో 12కోట్లు రాబట్టింది.

అర్జీ అధికారిగా నటించిన స్టాలిన్ మూవీ 23కోట్లు వసూలు చేసింది. శంకర్ దాదా ఎంబి బిఎస్ మూవీ 2004లో రిలీజ్ కాగా 26కోట్లు వసూలు చేసింది. ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ మూవీ కూడా 26కోట్లు కలెక్ట్ చేసింది.

మెగాస్టార్ గా వెలుగొందుతూ రాజకీయాల్లో చేరి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. కాంగ్రెస్ లో విలీనం చేసి, కేంద్రమంత్రిగా కూడా పనిచేసి, దాదాపు 9ఏళ్ల విరామం తర్వాత టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఖైదీ నెంబర్ 150మూవీతో మెగా హిట్ అందుకున్నాడు. ఈ మూవీ 104కోట్లు వసూళ్లు రాబట్టింది. సైరా నరసింహారెడ్డి మూవీ హిస్టారికల్ మూవీ.

అలా వరుస సినిమాలు చేస్తూ ఇంకా బిజీగానే గడుపుతున్నారు మెగాస్టార్. ఈ వయసులో కూడా తనకు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."