Beauty Tips

Dry Lips:పొడిగా మారిన పెదవులు మృదువుగా మారాలంటే…

Dry lips beauty tips: ఈ చలి కాలంలో చర్మం పొడిగా మారిపోతుంది ముఖ్యంగా పెదవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పెదాలు పగిలి అందవిహీనంగా కనబడటమే కాకుండా నొప్పి కూడా వస్తుంది.

ఈ సమస్య నుంచి బయట పడి పెదవులు మృదువుగా మారాలంటే ఒక చిట్కా తెలుసుకుందాం దీనికోసం మార్కెట్లో దొరికే క్రీమ్స్ ఆయిల్స్ వంటివి వాడాల్సిన అవసరం లేదు ఇంటిలో దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో పెదవులను మృదువుగా మార్చుకోవచ్చు.

బంగాళదుంప ముక్కలు కట్ చేసి ఆ ముక్కతో పెదాలను చుట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా నాలుగు రోజులపాటు చేస్తే పెదాలు మృదువుగా మారతాయి. పెదాలపై మృతకణాలు కూడా తొలగిపోతాయి.

అలాగే మరో చిట్కా కూడా ఉంది రాత్రి పడుకునే ముందు పెదాలపై తేనె రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి ఈ విధంగా కొన్ని రోజులపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

గులాబీ రేకులను మెత్తని పేస్ట్ గా చేసి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాసి ఐదు నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా ఈ చిట్కాలను పాటిస్తే పెదాలు సున్నితంగా మృదువుగా మారతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.