Devotional

Gomatha food:గోమాతకు ఈ ఆహారాలను పెడితే 7 జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం దక్కుతుంది

Gomatha food in telugu : హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. హిందువులు ఆవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఆవులను పూజిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం.

ఆవులను పూజించే సమయంలో ఆవులకు వేటిని ఆహారంగా పెడితే పుణ్యం వస్తుందో తెలుసా? ఇప్పుడు ఆ విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను ఆవులకు పెడితే పుణ్యంతో పాటు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం.

నానబెట్టిన ఉలవలను గోమాతకు తినిపిస్తే చేస్తున్న వృత్తిలో నిలకడ ఉంటుంది. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు తినిపిస్తే ధనం సమృద్ధిగా ఉంటుందని.
నానబెట్టిన గోధుమలను గోమాతకు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

తోటకూర,బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే మానసికముగా ప్రశాంతత కలుగుతుంది. నానబెట్టిన కందులను గోమాతకు తినిపిస్తే కోపం,అప్పుల బాధలు తొలగిపోతాయి.
నానబెట్టిన మినుములను గోమాతకు తినిపిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

బీట్రూట్,పాలకూర గోమాతకు తినిపిస్తే ధన వృద్ధి కలిగి ఐశ్వర్యవంతులు అవుతారు. టమోటాలను గోమాతకు తినిపిస్తే వివాహం కానివారికి వివాహం అవుతుంది.
బంగాళదుంపలను గోమాతకు తినిపిస్తే ఏమైనా నరఘోష ఉంటే తొలగిపోతుంది.

క్యారెట్ లను గోమాతకు తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. వంకాయను గోమాతకు తినిపిస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అరటి పండును గోమాతకు తినిపిస్తే ఉద్యోగంలో ఉన్నత పదవి దక్కుతుంది.

దొండకాయను గోమాతకు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. మినప పిండి,బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే ధనం సంపాదించే మంచి మార్గాలు కన్పిస్తాయి.
గోధుమ పిండి,బెల్లం కలిపి గోమాతకు తినిపిస్తే ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఉద్యోగం వస్తుంది.

నానబెట్టిన ఛాయ పెసరపప్పు గోమాతకు తినిపిస్తే ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది. నానబెట్టిన పొట్టు పెసరపప్పు గోమాతకు తినిపిస్తే పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఇంటిలో ఉన్న కలతలు అన్ని తొలగిపోయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.