Beauty Tips

Fruit Peels:పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మనకు ఎలా ఉపయోగపడతాయో చూడండి

Fruit Peel Beauty benefits:పళ్ళతో పాటు వాటి తొక్కలు కూడా మన అందానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అరేంజ్ తొక్కలు ముఖ వర్చసును రెట్టింపు చేయటానికి దోహదం చేస్తాయి. ఆరెంజ్ తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి.

ఈ పొడికి సమానంగా పచ్చి పాలను తీసుకోని మెత్తగా ముద్దగా చేసి రెండు గంటల పాటు నానబెట్టాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి సమానంగా పట్టించి గంట పాటు ఆరనివ్వాలి. అనంతరం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ తీసివేసే ప్రక్రియలో ముఖాన్ని గట్టిగా రుద్దకూడదు.

జిడ్డు చర్మం ఉన్నవారికి ఆరెంజ్ మాస్క్ బాగా పనిచేస్తుంది. వీరు ఈ మాస్క్ ను వారంలో కనీసం రెండు సార్లు వేసుకుంటే ముఖం జిడ్డుగా లేకుండా ఉంటుంది. అంతేకాక మొటిమలు కూడా తగ్గే అవకాశం ఉంది. ముఖ వర్చసు కూడా బాగా పెరుగుతుంది.

ఆరెంజ్ తొక్కలు మాస్క్ కొరకు మాత్రమే కాకుండా స్నానానికి కూడా ఉపయోగించవచ్చు. ముందు రోజు రాత్రే స్నానం చేసే నీటిలో ఆరెంజ్ తొక్కలతో పాటు ఒక నిమ్మచెక్క కూడా వేయాలి. తెల్లవారిన తర్వాత కావాలని అనుకుంటే వాటిని తీసివేయవచ్చు.

స్నానానికి ఇంత సమయం కేటాయించ లేనివారు స్నానం చేసే నీటిలో రెండు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.