Beauty Tips

Skin Glow Tips:ముఖం ఆకర్షణీయముగా ఉండాలంటే…ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Skin Glow Tips:కొంతమందిని చూసిన వెంటనే వారి అందం మన కళ్లను కట్టిపడేస్తుంది. వారి అందానికి మనం ఇట్టే ఆకర్షితులమవుతాం. వారిలోని సౌందర్య మహిమే అందుకు కారణం. ఆ రహస్యమేదో మనం తెలుసుకుంటే మన అందం కూడా పదింతలు మెరుగవుతుంది. అందానికి ప్రథమ శత్రువు ముడతలు. అందువల్ల సాధ్యమైనంత వరకూ ముడతలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణ చర్మతత్వం ఉన్నవారు కోడిగుడ్డులోని పచ్చసొనలో రెండు స్పూన్ల రోజ్‌వాటర్, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపాలి. ఆ మిశ్రమాన్ని ఒక సీసాలో భద్రపరచుకుని వారంలో ఒకసారి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

పొడి చర్మం ఉన్నవారు కోడిగుడ్డులోని పచ్చసొనలో రెండు స్పూన్ల నారింజ రసం, కొన్ని చుక్కల బాదం నూనె, అరచెంచా నిమ్మరసం వేసి బాగా కలిపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, అరగంట తర్వాత కడుక్కుంటే ముడతలకు దూరంగా ఉంచవచ్చు.

ముందుగా ముఖంపై తేనెను రాసుకోవాలి. కొంత సమయం తర్వాత బొప్పాయి లేదా యాపిల్ గుజ్జును ముఖంపై రాసుకోవాలి. పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత కడుక్కుంటే ముఖం తేజోవంతంగా ఉంటుంది.

మూడు స్ట్రాబెర్రీ పండ్ల గుజ్జులో కొద్దిగా రోజ్‌వాటర్ కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.