Health

Green Tea:వావ్…. గ్రీన్ టీ ఎంత మాయ చేస్తుందో తెలుసా ?

Green Tea Health Tips:ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రోజు మొత్తంలో చాలా సార్లు టీ త్రాగుతూ ఉంటాము. ఇంటికి అతిధులు వచ్చినప్పుడు,సాయం సమయంలో స్నాక్స్ తో పాటు ఇలా రోజుకి రెండు,మూడు సార్లు టీ త్రాగుతూ ఉంటాము.

కాపీ త్రాగటం కన్నా టీ త్రాగటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందువలన కాపీ ప్రియులు కన్నా టీ ప్రియులే ఎక్కువగా ఉన్నారు. అయితే మాములు టీ కన్నా గ్రీన్ టీ లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఊబకాయంతో బాధపడేవారికి గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుంది. శరీర ప్రక్రియను క్రమబద్దం చేసే శక్తి గ్రీన్ టీ కి ఉంటుంది. దీనిలో శరీరానికి అవసరమైన యాంటిఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరంలో ఉన్న కొలస్ట్రాల్ ను తగ్గించటానికి సహాయం చేస్తుంది.

క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగడం వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇది బ్లడ్ వెస్సెల్స్ తీరును మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే ఫ్లెవొనాయిద్స్ గుండె సక్రమంగా పని చేయడానికి దోహదం చేస్తాయి. రోజు క్రమం తప్పకుండా కప్పు టీ తాగడం వలన ఆరోగ్యం తో పాటు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

ఇప్పటి వరకు ఊబకాయం తగ్గడానికీ,గుండెను ఆరోగ్యంగా ఉంచుకొవడానికీ ఉపకరించే గ్రీన్ టీ కాన్సర్ కణాలతో కూడా సమర్ధవంతంగా పోరాడుతుందన్న సంగతి ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.