Devotional

భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

What Not To Do When Your Wife is Pregnant :హిందూ సంప్రదాయం ప్రకారం భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త కొన్ని ఆచారాలు పాటించాలి. అంతే కాదు భార్య కోరికమేరకు నడుచుకోవాలి. ఆమెకు ఏది ప్రీతికరమైనదో తెలుసుకుని ఆ వస్తువులను తెచ్చిపెట్టాలి.

ఆమె సంతోషంగా ఉంటే ఆమె కడుపులోని బిడ్డకూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే భర్త చేయకూడని ఆచారాలు కూడా మన హిందూ సంప్రదాయాలలో ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతుడగు పుత్రుడు జన్మిస్తాడట. భార్య కోరికలు తీర్చకపోతే దోషము కల్గునట.

భార్య గర్భిణిగా ఉన్నప్పుడు చెట్లు నరకడం, సముద్ర స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు.

భార్య గర్భం దాల్చిన 6 నెలలు తరువాత భర్త క్షౌరము చేయించుకోరాదట.

భార్య గర్భిణిగా ఉన్న సమయంలో శవం మోయడం వంటి పనులు చేయకూడదట.

భార్య గర్భం దాల్చిన తరువాత విదేశీ ప్రయాణాలు చేయడం భార్యను విడిచి దూరంగా వెళ్ళడం లాంటివి చేయరాదట.

భార్య గర్భం దాల్చిన ఏడవ నెల మొదలయినప్పటి నుండి క్షౌరము, తీర్ధయాత్ర, నావ యొక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలి.

పర్వతా రోహణము, యుద్ధము చేయుట. ఇంటికి స్తంభ ముహూర్తము గానీ, గృహారంభము గానీ, వాస్తుకర్మ కానీ చేయకూడదట. ఈ పనులకు దూరంగా ఉండడమే మంచిదట.

శవమును అనుసరించి వెళ్ళరాదు. అలాగే ప్రేతకర్మలు చేయకూడదట. ఇంకా ఉపశమనం, పిండదానము చేయకూడదట.