Beauty Tips

Hair lice:ఇలా చేస్తే నిమిషాల్లో మీ తలలో పేలు మాయం

Hair lice remove tips In Telugu : తలలో పేల సమస్య అనేది ప్రతి ఒక్కరు ఎదో ఒక సమయంలో ఎదుర్కొంటారు. తలలో పేలు ఉంటే చాలా దురద పెడుతుంది. ఆ దురద ఎక్కువైనప్పుడు చాలా చిరాకు వస్తుంది. తలలు పరస్పరం తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి పేలు వ్యాపిస్తుంటాయి. స్కూల్ కి వెళ్లే పిల్లల్లో పేల సమస్య ఎక్కువగా ఉంటుంది.

ఎక్కువ మందితో కలిసి ఉండటం వల్ల కూడా పేల సమస్య పెరుగుతుంది. పేలు తలలో వెంట్రుకలను అంటిపెట్టుకొని రక్తాన్ని ఆహారంగా తీసుకొని జీవిస్తాయి. పేలు ఒక్కసారి వచ్చాయంటే వాటిని వదిలించుకోవటం కష్టమే. తలలో పేలను వదిలించుకోవడానికి ఎటువంటి రసాయనాలు వాడవలసిన అవసరం లేదు.

మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో పేల సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు. 5 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్ లో వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలో పావుస్పూన్ మిరియాల పొడి,అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి జుట్టు అంతా పట్టించాలి.

ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఆ తర్వాత జుట్టు కాస్త తడిగా ఉన్నప్పుడే దువ్వెనతో దువ్వితే పేలు అన్నీ తొలగి పోతాయి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే పేలు సమస్య వదిలిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.