Beauty Tips

Skin Problems:ఉప్పులో ఈ నూనెలను కలిపి రాస్తే దురదలు,ఇన్ఫెక్షన్స్, చర్మవ్యాధులు అన్ని మాయం

salt Beauty Tips In Telugu : ముఖం తెల్లగా అందంగా కాంతివంతంగా మెరిసిపోవాలని మనలో చాలా మంది భావిస్తారు. చర్మం మీద మృత కణాలు పేరుకుపోతే చర్మం కాంతివంతంగా ఉండదు. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. చర్మంపై పొట్టు రాలుతూ ఉంటుంది. చర్మంపై ముడతలు కూడా వస్తూ ఉంటాయి.

ఇవన్నీ తొలగించడానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. దీనికోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా చేసుకోవచ్చు. అలాగే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది. కాస్త శ్రద్ద పెడితే మంచి ఫలితం ఉంటుంది.

ఒక బౌల్లో ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ తేనె, అరస్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె, రెండు చుక్కలు ఎసెన్షియల్ ఆయిల్ అంటే జాస్మిన్ ఆయిల్ లేదా రోజ్ ఆయిల్ ఏదైనా వాడవచ్చు. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ముఖానికి పట్టించి పావుగంటయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మృతకణాలు తొలగిపోవటమే కాకుండా ఎటువంటి ఇన్ఫెక్షన్లు రావు. ఈ మిశ్రమం యాంటీ సెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. దురదలు, నల్లని మచ్చలు మొటిమలు ఇలా అన్ని రకాల చర్మ సమస్యలు తొలగిపోతాయి. చర్మం మీద ముడతలు లేకుండా కాంతివంతంగా తెల్లగా మెరుస్తోంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.