Beauty Tips

Cracked Lips:ఈ పండుతో ఇలా చేస్తే పగిలిన,నల్లగా ఉన్న పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి

pineapple repairs your cracked lips : పెదాలు అందంగా,ఆకర్షణీయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆహారపు అలవాట్లు,వాతావరణంలో కాలుష్యం, వేసవిలో ఉండే డీహైడ్రేషన్, అధిక వేడి వంటి అనేక రకాల కారణాలతో పెదాలు పొడిగా మారి పగులుతూ ఉంటాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.

ఈ వేసవిలో విరివిగా లభించే అనాస పండు పగిలిన పెదాలను మృదువుగా చేస్తుంది. అనాసపండు తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ నుంచి రసం తీయాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల అనాస రసం, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు చుక్కల విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి 5 నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో ఉదయం ఒకసారి,సాయంత్రం ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా పెదాల పగుళ్లు,నలుపు తగ్గి పెదాలు మృదువుగా గులాబీ రంగులోకి మారతాయి. ఈ మిశ్రమంను ఫ్రిజ్ లో పెడితే నాలుగు రోజులు నిల్వ ఉంటుంది.

అనాస పండులో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. పైనాపిల్ అనేది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్ గా పనిచేస్తుంది. ఇది చర్మం నుండి చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. పగిలిన పెదవులను మృదువుగా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కా పాటించి పగిలిన పెదాలను మృదువుగా మార్చుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."