Joint Pains:మోకాళ్లలో గుజ్జు రావటమే కాకుండా కీళ్ల నొప్పులు జీవితంలో లేకుండా చేస్తుంది
Mahabeera Ginjalu Benefits in Telugu : ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు అనేవి 30 సంవత్సరాల వయస్సులోనే వచ్చేస్తున్నాయి. నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇప్పుడే చెప్పే గింజలు బాగా సహాయపడతాయి. నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ గింజలను వాడితే తొందరగా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
ఆ గింజలు మహాబీర గింజలు. ఇవి ఆయుర్వేదం షాప్ లో లభ్యం అవుతాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మహాబీర గింజలను వేసి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన గింజలను తింటూ ఆ నీటిని తాగాలి. ఈ నీటిని త్రాగటం వలన కీళ్ల నొప్పులతో పాటు అన్ని రకాల జాయింట్ నొప్పులు తగ్గుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
మహా బీర గింజలు సబ్జా గింజల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. నీటిలో నానబెట్టినప్పుడు సబ్జా గింజల మాదిరిగానే ఉబ్బుతాయి. వీటిని నీటిలో
నానబెట్టినప్పుడు, దాని అసలు పరిమాణంలో 30 రెట్లు పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ గింజలను నానబెట్టినప్పుడు వచ్చే జిగురు పదార్ధం కీళ్ల మధ్య గుజ్జును పెంచుతుంది.
మహా బీర గింజలు మోకాల్లో గుజ్జును పెంచటమే కాకుండా శరీరంలో వేడిని తగ్గించటానికి కూడా బాగా సహాయపడతాయి. మహా బీర గింజలు తులసి జాతికి చెందినది. మూడు నెలల పాటు మహా బీర గింజలను వాడితే మోకాల్లో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అధిక బరువు ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనం కలుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.