Devotional

మన శరీరంలోని అవయవాలు అదిరితే…ఏమి జరుగుతుందో తెలుసా?

చాలా మంది ఈ రోజు నా కన్ను అదిరింది. ఏమి జరుగుతుందో అని ఆందోళన పడుతూ ఉండటం సహజమే. కొంతమంది శుభం జరుగుతుందని అంటే….మరికొంత మంది అశుభం జరుగుతుందని అంటారు. అయితే స్త్రీ, పురుషులకు సంబంధించి వారి శరీరంలోని ఏయే అవయవాలు అదరడం వలన ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

పురుషులకు కుడి భాగమునందు, స్త్రీలకు ఎడమవైపు అవయవాలు అదిరితే వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే పురుషులకు ఎడమవైపు, స్త్రీలకు కుడివైపు అవయవాలు అదిరినచో వాటి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుందట. అంటే చెడు ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి.

శరీరంలో ఏయే అవయవాలు అదిరితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం…

తల పైభాగము – స్థిరాస్థి, భూ లాభములు
నుదురు – గృహ, మరియు స్థానవృద్ధి జరుగును
కనుబొమ్మల మధ్యన – స్నేహ లాభము, మంచి స్నేహితులు లభిస్తారు
కంటి చివర – ఇష్టమైన వస్తువులు దరిచేరుతాయి
కంటికింద – విజయము వరిస్తుంది
చెవులు- మనసుకు ఇష్టమైన మాటలు వింటారు
చెక్కిళ్ళు – స్త్రీలకు భర్త, పురుషులకు భార్య లాభము
ముక్కు- సుఖసౌఖ్యాలు
పెదవులు – మంచి భోజన వసతి
చేతులు – డబ్బు, ధాన్యము
హృదయం – విచారము
రొమ్మునందు – విజయము
భుజములు – అనుకున్నవి నెరవేరుతాయి
గొంతు- భోగభాగ్యాలు
కడుపు – ధనప్రాప్తి కలుగును
నాభి- ఒకచోటు నుండి ఇంకోచోటుకి బదిలీలు, చేసేపనిలో మార్పులు
స్థనము నందు – వాహనలాభము
వీపు – పరాజయం చవిచూస్తారు
పాదాలు – స్థానలాభము
మోకాళ్ళు – వ్యాధుల భయము

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."