Weight Loss Tips:ఈ ఆహారాలను తింటే శరీరంలో కొవ్వు రెట్టింపు వేగంతో కరిగి అధిక బరువు అనేది అసలు ఉండదు
Weight Loss Foods : మారిన జీవనశైలి, సరిగ్గా వ్యాయామం చేయకపోవటం,ఎక్కువసేపు కూర్చోవటం వంటి కారణాలతో అధిక బరువు మరియు శరీరంలో కొవ్వు పెరుకుపోతుంది. శరీరంలో అదనంగా పెరుకున్న కొవ్వును కరిగించటానికి మన వంటింటిలో ఉండే కొన్ని వస్తువులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

పసుపు
పసుపును ప్రతి రోజు వాడుతూ ఉంటాం. పసుపులో ఉండే కర్కుమిన్ కొవ్వు కణాలను విచ్చిన్నం చేసి కొవ్వును కరిగిస్తుంది. కర్కుమిన్ అనేది
శరీరంలో ఉండే తెలుపు కొవ్వును గోధుమ కొవ్వుగా మారుస్తుంది. తెలుపు కొవ్వు అధిక బరువుకి కారణం. గోధుమ కొవ్వు అనేది గ్లూకోజ్‌తో కలిసి శరీరంలో శక్తిగా ఉపయోగించబడుతుంది.

ఉల్లిపాయ
ఉల్లిపాయ బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో ఉండే క్వెర్ సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దాంతో ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. కొవ్వు కణాలను విచ్చిన్నం చేసి కొవ్వు వేగంగా కరగటానికి సహాయపడుతుంది.

యాలకులు
యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. శరీరంలో వ్యర్థాలు, హానికారక బ్యాక్టీరియా వంటి వాటిని బయటకు పంపేస్తాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది.

పచ్చిమిర్చి
పచ్చిమిర్చి బరువు తగ్గటానికి చాలా బాగా సహాయపడుతుంది. పచ్చిమిర్చిలోని పెప్పైన్ కంటెంట్ శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్తుంది. రెగ్యులర్ గా పచ్చిమిర్చిని ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఒట్స్
ఒట్స్ బరువు తగ్గటానికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. శరీరంలో కొవ్వును కరిగించటమే కాకుండా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఉదయం సమయంలో ఒట్స్ ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే అధిక బరువు తగ్గటమే కాకుండా రోజంతా చురుకుగా ఉంటారు.

అల్లం
అల్లంలో ఉండే లక్షణాలు ఆకలిని నియంత్రించి ఆకలి తొందరగా వేయకుండా చేస్తుంది. దాంతో ఆహారం తీసుకోవాలనే కోరిక ఉండదు. అల్లంలో షోగోల్స్, జింజెరాల్స్ అనే పదార్ధాలు శరీర ప్రక్రియలను నియంత్రణ చేస్తాయి. నడుం సన్నబడాలన్నా, నడుం చుట్టూ రింగులా పేరుకుపోయిన కొవ్వు కరగిపోవాలన్నా… అల్లం తినాల్సిందే.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


