Kitchenvantalu

Palak Paneer Uttapam Recipe:రెస్టారంట్ స్టైల్ పాలక్ పనీర్ ఉతప్పం.. అధిక బరువు ఉన్నవారికి..

Palak Paneer Uttapam Recipe: దీనిని చాలా సులభంగా చేయవచ్చు. అలాగే ఉదయం సమయంలో తింటే బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

కావలసిన పదార్ధాలు
1 కప్పు పాలక్ పేస్ట్
1 కప్పు  రవ్వ
1/2 కప్పు పెరుగు
ఉప్పు రుచికి సరిపడా
చిటికెడు ఫ్రూట్ salt
1/2 కప్పు పనీర్
1/2 ఉల్లిపాయ(ముక్కలుగా కట్ చేయాలి)
1/2 టొమాటో(ముక్కలుగా కట్ చేయాలి)
సన్నగా తరిగిన1 tsp పచ్చిమిర్చి
సన్నగా తరిగిన1 టేబుల్ స్పూన్ కొత్తిమీర

తయారి విధానం
ఒక గిన్నెలో రవ్వను తీసుకుని, దానికి పెరుగు, ఉప్పు మరియు పాలకూర పేస్ట్ కలపాలి. అవసరానికి తగ్గట్టుగా నీటిని చేర్చాలి. ఈ పిండిని అరగంట పక్కన పెట్టాలి.
టాపింగ్ చేయడానికి ఒక గిన్నెలో ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పనీర్ మరియు ఉప్పు వేసి బాగా కలపాలి.

ఇప్పుడు పిండిలో ఫ్రూట్ సాల్ట్ మరియు కొద్దిగా నీరు కలపండి.. పిండి ఉబ్బుతుంది.ఒక బాణలిలో కొంచెం నూనె వేసి, ఇప్పుడు గరిటె పిండిని పోసి, దానిపై కొంచెం టాపింగ్ వేసి స్ప్రెడ్ చేయాలి.

ఒక వైపు నుండి కాల్చిన తర్వాత, మరొక వైపు కూడా కాల్చాలి. అప్పుడు ఎంతో రుచికరమైన ఉతప్పం రెడీ. మీకు నచ్చిన చెట్నీతో తినండి.