Business

Best Monsoon tourist places: జులై నెలలో ట్రిప్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా.. వీటిని మిస్ కాకండి

Best Monsoon tourist places: జులై నెలలో తప్పక చూడాల్సిన 5 పర్యాటక ప్రాంతాలు.. మిస్ కాకుండా చూడండి.. ప్రస్తుతం వానలు పడుతున్నాయి. వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగింది. ట్రావెలింగ్ ప్లాన్ ఉన్నవారు జులై నెలలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

ఈ సమయంలో సందర్శించవలసిన ప్రదేశాలలో హిమాచల్ ప్రదేశ్ లో డల్హౌసీ ఒకటి. ఇక్కడ చూడవలసిన ప్రదేశాల విషయానికి వస్తే.. డల్హౌసీ, ఖజ్జియార్, పంచ్పులా, సచ్ పాస్, డైన్కుండ్ శిఖరం, చమేరా సరస్సు, సత్తారా జలపాతం, బారా పథర్, బక్రోటా హిల్స్, టిబెటన్ బజార్, గంజి హిల్, రాక్ గార్డెన్, చంబా టౌన్, కలాటాప్ వన్యప్రాణుల అభయారణ్యం అనేవి ముఖ్యమైనవి.

ఉత్తరాఖండ్ లోని ముస్సోరి ఒక అందమైన హిల్ స్టేషన్ అని చెప్పవచ్చు. ముస్సోరీలో లాల్ టిబ్బా, గన్ హిల్ పాయింట్, కెంప్టీ జలపాతం, ఝరిపానీ జలపాతం, కంపెనీ గార్డెన్ మరియు క్లౌడ్స్ ఎండ్ లాంటి సందర్శించదగ్గ ప్రాంతాలు ఉన్నాయి.

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జులై నెలలో పచ్చని చెట్లు, రంగుల పూలతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ పువ్వులలో సాక్సిఫ్రేజ్, వైల్డ్ రోజ్, జెరేనియం, బ్లూ కొరిడాలిస్ ఉన్నాయి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, హేమకుండ్ సాహిబ్, పుష్పావతి నదిని మిస్ కాకుండా చూడాలి.

నైనిటాల్ లో ఏడు సరస్సులు కనిపిస్తాయి. అందువల్ల సరస్సుల నగరం అని పిలుస్తారు. ఇక్కడ నైనిటాల్ సరస్సు, టిఫిన్ టాప్, హై ఆల్టిట్యూడ్ జూ, ఎకో కేవ్ గార్డెన్, భీమ్ తాల్ సరస్సు, కిల్బరీ పక్షుల అభయారణ్యం, రాజ్ భవన్ – గవర్నర్ హౌస్ వంటి వాటిని మిస్ కాకుండా చూడాలి.

మంచుతో కప్పబడిన పర్వతాలు, దట్టమైన పైన్ అడవులు, అందమైన లోయలతో ధర్మశాల మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ ట్రియుండ్ హిల్, ధర్మశాల క్రికెట్ స్టేడియం, సెయింట్ జాన్ ఇన్ వైల్డర్నెస్ చర్చ్, వార్ మెమోరియల్, గుటో మొనాస్టరీ, దాల్ లేక్, టీ ప్లాంటేషన్, సుగాలాగ్ ఖాంగ్, భాగ్సు జలపాతం, కాంగ్రా వ్యాలీ, ధరమ్కోట్ వంటి వాటిని తప్పనిసరిగా చూడాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.