Nirupam Paritala: డాక్టర్ బాబు.. కార్తీక దీపం సీరియల్ కు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా.. ?
Nirupam Paritala: డాక్టర్ బాబు.. కార్తీక దీపం సీరియల్ కు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా.. కార్తీక దీపం సీరియల్ లో నిరుపమ్ డాక్టర్ బాబుగా నటించి ఎంతో పేరును తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ లో నటించినప్పుడు రోజుకి దాదాపుగా 22౦౦౦ పారితోషికం తీసుకొనేవాడు.
ఆ సీరియల్ సూపర్ డూపర్ హిట్ కావటంతో.. ఇప్పుడు కార్తీక దీపం ఇది నవ వసంతం అనే సీరియల్ ను కార్తీక దీపం మేకర్స్ బులితెర అభిమానుల ముందుకు తీసుకువచ్చారు.
ఈ సీరియల్ కోసం నిరుపమ్ రోజుకి 40 వేల వరకు తీసుకుంటున్నాడని సమాచారం. చంద్రముఖి సీరియల్ తో టెలివిజన్ తెరకు పరిచయమైన నిరుపమ్ ఆ తరువాత వరుస సీరియల్స్ తో మెప్పించాడు.
ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూనే సొంత YOUTUBE చానల్ ద్వారా ఇంకా అభిమానులకు దగ్గర అవుతున్నాడు. అలాగే సీరియల్స్ నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టాడు. అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.