Kitchenvantalu

Street Style Masala Vada Recipe:మసాలా వడ క్రిస్పీ గా రావాలంటే ఇలా చేయండి

Street Style Masala Vada Recipe:మసాలా వడ క్రిస్పీ గా రావాలంటే ఇలా చేయండి.. ఎన్ని చిరు తిండ్లూ ఉన్నా,ఇంకా కొత్తగా కావాలనిపిస్తుంది. ముఖ్యంగా వర్షా కాలంలో , కూల్ కూల్ గా వెదర్ ఉంటే,నోటికి కాస్త కారంగా, ఘాటూగా తగిలితే బాగుంటుంది..

అలాంటి సమయంలో మసాలా వడ,ఆ లోటును తీరుస్తుంది. ఇప్పుడు మరి మసాలా వడ ఎలా తయారు చేయాలో చూసేద్దామా..

కావాల్సిన పదార్ధాలు
శనగపప్పు – 1/4 KG
వెల్లుల్లి రెబ్బలు – 7 లేదా 8
అల్లం – 1 ఇంచ్
జీలకర్ర – 1/2 టీ స్పూన్
ఎండు మిరపకాయలు – 2
పచ్చిమిర్చి -2
బియ్యం పిండి – 1 ½ టీ స్పూన్
కరివేపాకు – రెమ్మ
కొత్తిమీర – కొద్దిగా
ఉల్లిపాయ – మీడియం సైజ్
ఉప్పు – రుచికి సరిపడా
గరం మసాలా – 1 టీ స్పూన్
ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం
1.పచ్చి శెనగపప్పు నాలుగు గంటల పాటు నాన బెట్టాలి.

2. నానిన శనగపప్పును వడగట్టి, కొద్దిగా పప్పు తీసి పక్కన పెట్టుకోవాలి, మిగితాది మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.

3. అందులోకి వెల్లుల్లి రెబ్బలు, అల్లం, జీలకర్ర,ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బియ్యం పిండి వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

4. ఆ పేస్ట్ ను, వేరొక గిన్నేలోకి ట్రాన్స్ ఫర్ చేసుకుని, పక్కకు పెట్టుకున్న శనగపప్పును, పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసుకుని, రెండూ మిక్స్ చేసుకోవాలి.

5. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర , కరివేపాకు, , ఉల్లిపాయలు, యాడ్ చేసుకోవాలి.

6. రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసుకుని, వడా పిండి బాగా కలిసేలా కలుపుకోవాలి.

7. ఇఫ్పుడు పిండిని కొద్దికొద్దిగా తీసుకుని అరచేతి పై వడలు వత్తుకోవాలి.

8. బాండీ లోకి ఆయిల్ తీసుకుని, బాగా వేడి చేయాలి.

9. తయారు చేసుకున్న వడలను ఒకోక్కటిగా నూనెలో వేసి, రెండు వైపులా తిప్పుతూ, వేగనివ్వాలి.

10. రెండు వైపులా వేగిన వడలను ప్లేట్ లోకి తీసుకోవాలి.

11. అంతే మసాలా వడా రెడీ