Beauty Tips

Alovera For Hair:కలబంద జుట్టు సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతుందో తెలుసా ?

Alovera Hair Problems tips:కలబందను ఇప్పుడు చెప్పే విధానంలో వాడితే జుట్టుకి సంబంధించిన సమస్యల నుండి బయట పడవచ్చు. కలబందలో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి.

కలబందను ఇప్పుడు చెప్పిన విధంగా వాడితే జుట్టుకు సంబందించిన సమస్యలు చుండ్రు,జుట్టు రాలే సమస్య వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. వీటి కోసం మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు.

1. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
కలబంద చర్మం కోసమే కాకుండా జుట్టు కోసం కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద జెల్ ని జుట్టుకు రాస్తే జుట్టు బాగా పెరుగుతుంది.

ఎలా ఉపయోగించాలి?
కలబంద జెల్ మరియు ఆముదం జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

కావలసినవి
కలబంద జెల్ – 2 స్పూన్స్
ఆముదం – 1 స్పూన్

పద్దతి
* కలబంద, అముదంలను కలపాలి.
* ఈ మిశ్రమాన్ని తల మీద చర్మం మరియు జుట్టుకు రాసి నిదానంగా మసాజ్ చేయాలి.
* రాత్రి సమయం అంతా అలా ఉంచి మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఎలా పనిచేస్తుంది?
కలబంద చనిపోయిన కణాలను తొలగించి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

2. చుండ్రును తగ్గిస్తుంది
మార్కెట్ లో కలబంద షాంపూలు అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇది చుండ్రు మరియు తల మీద చర్మం మీద దురద సమస్యలను తగ్గించటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?
చుండ్రు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. తల మీద చర్మం జిడ్డుగా ఉండటం, మృత కణాలు చేరడం లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు. తల మీద మృత కణాలు తొలగిపోవటానికి కలబంద సహాయపడుతుంది. దీనిలో యాంటీ మైక్రోబియాల్ మరియు శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన వ్యాధుల మీద పోరాటం మరియు తల మీద
చర్మాన్ని ప్రశాంతపరుస్తుంది.

3. జుట్టు యొక్క pH సంతులనంను నిర్వహిస్తుంది
జుట్టులో pH సంతులనం సరిగ్గా లేనప్పుడు జుట్టుకు అనేక సమస్యలు వస్తాయి. కలబంద జుట్టులో pH సంతులనం నిర్వహించటానికి సహాయపడుతుంది.

ఎలా పనిచేస్తుంది?
తల మీద చర్మం pH విలువ 5.5 ఉంటుంది. మార్కెట్లో దొరికే అనేక జుట్టు ఉత్పత్తులలో ఆల్కలీన్ ఉండుట వలన, అది జుట్టు pH మీద ప్రభావం చూపుతుంది. దీని వలన జుట్టు దెబ్బ తినుట మరియు క్రమ రహిత్యాలు ఏర్పడతాయి. అటువంటి సమయంలో కలబంద జుట్టు pH స్థాయిలను క్రమపరచి జుట్టు ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తుంది.

4. జుట్టు చికిత్స
కలబందలో సహజసిద్దంగా తేమ ఉండుట వలన గొప్ప సంరక్షణకారిణి అని చెప్పవచ్చు. దాంతో జుట్టును బలోపేతం చేసి మెరిసేలా చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి?
తలకు షాంపూ చేసిన తర్వాత జుట్టు చికిత్స కోసం కలబంద జెల్ ని రాయాలి.

ఎలా పనిచేస్తుంది?
కలబందలో ప్రోటెయోలైటిక్ ఎంజైమ్ ఉండుట వలన మృత కణాలను తొలగించటంలో సహాయపడుతుంది. కణాలను పునరుత్పత్తి చేసి జుట్టు మరమత్తులో సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.