MoviesTollywood news in telugu

Mahesh Sister:ఈ ఫోటోలో ఉన్న మహేష్ చెల్లిని గుర్తు పట్టారా.. ఏమి చేస్తుందో తెలుసా..?

Mahesh Babu Okkadu sister :సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ఒక్కడు మూవీ ఒక రికార్డు. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాదు, మహేష్ స్టామినా ఏమిటో చూపించింది.

ఇక ఈ మూవీలో మహేష్ బాబుని టీజ్ చేసే చెల్లి పాత్రలో నటించి ఆకట్టుకున్న అమ్మాయి తెలుసు కదా. ఆమె పేరు నిహారిక. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా వెంకటేష్, మోహన్ బాబుతో కూడా నటించి, ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

అయితే కొందరు చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి, ఆతర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై పోతారు. కొందరు మాత్రం పెద్దయ్యాక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుతారు. శ్రీదేవి, మీనా, రాశి, కీర్తి సురేష్, రోజా రమణి, తులసి ఇలా చాలామంది ఉన్నారు.

ఆ బేబీ నిహారిక ఇప్పుడు పెద్ద అమ్మాయి అయ్యింది. పెద్ద అవ్వడం మాత్రమే కాకుండా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సెటిల్ అయినట్లు తెలుస్తోంది. చైల్డ్‌ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసిన నిహారిక పెద్ద అయ్యాక ఆఫర్లు వచ్చినా కూడా తిరస్కరించి చదువు పై దృష్టి పెట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. సినిమాలకు పూర్తి దూరం అయిన నిహారిక సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు ఇలా తన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.