Kitchenvantalu

Aloo garlic Bonda:స్ట్రీట్ స్టైల్ ఆలు బోండా ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే

Aloo garlic Bonda:స్ట్రీట్ స్టైల్ ఆలు బోండా ఇలా చేశారంటే టేస్ట్ అదిరిపోవాల్సిందే..ఆలు వెల్లుల్లి బోండా..ఈవినింగ్ అయిందంటే చాలు,అమ్మా స్నాక్స్ అంటూ మొదలు పెడతారు పిల్లలు,రొటీన్ గా చేస్తే నచ్చదు.రోజూ కొత్తగా కావాలంటారు.పిల్లల కోసం ఆలు వెల్లుల్లి బోండా స్నాక్ ఐటెం ఎలా చేయాలో తెల్సుకుందాం

కావాల్సిన పదార్థాలు
బంగాళదుంపలు – 4
వెల్లుల్లి రెబ్బలు – 5
కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్
చిల్లీ ఫ్లెక్స్ – 1 టేబుల్ స్పూన్
ఓరిగానో – ½ టేబుల్ స్పూన్
బటర్ – 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
బ్రేడ్ క్రమ్స్ – 4 టేబుల్ స్పూన్స్
ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం
1. ముందుగా బంగాళదుంపలు ఉడికించి మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి
2. ఇందులోకి దంచిన వెల్లుల్లి రెబ్బలు , కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి.
3. చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో , రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
4. ఇందులో బ్రెడ్ క్రమ్స్ వేసి గట్టిముద్దలా గా తయారు చేసుకోవాలి.
5.ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని, డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి, వేడెక్కనివ్వాలి.
6.కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని, రెండు చేతులతో గుడ్రండి బాల్స్ గా చేసుకుని,డీప్ ఫ్రై చేసుకోవాలి.
7. ఎర్రగా కాలిన బాల్స్ ను ప్లేట్ లోకి తీసుకుంటే , ఆలు వెల్లుల్లి బోండా రెడీ.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."