Muntha Masala :బండి దగ్గర అందరూ ఇష్టంగా తినే ముంత మసాలా అదే రుచితో ఇంట్లోనే చేసుకోండి
Muntha Masala :బండి దగ్గర అందరూ ఇష్టంగా తినే ముంత మసాలా అదే రుచితో ఇంట్లోనే చేసుకోండి.. ముంత మసాలా..బయటికి వెళ్లినప్పుడు టైమ్ పాస్ కు తినే,ముంత మసాల స్నాక్స్,ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు,అచ్చం స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ వచ్చేలా,ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం.
కావాల్సిన పదార్దాలు
మరమరాలు – 3 కప్పులు
కార్న్ ఫ్లేక్స్ – ½ కప్పు
పల్లీలు – ¼ కప్పు
ఉల్లిపాయ – 1
టమాటో -1
కారెట్ -1
పచ్చిమిర్చి -1
ఉప్పు –తగినంత
జీలకర్ర పొడి – 1/4టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
కారం – ½ టీ స్పూన్
చాట్ మసాల – 1 టీ స్పూన్
ఆలు సేవ్ – 2 టీ స్పూన్స్
కొత్తిమీర – కొద్దిగా
నిమ్మరసం -½ టీ స్పూన్
నెయ్యి – 1 టీ స్పూన్
నూనె – తగినంత
తయారీ విధానం
1.స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని, మరమరాలు రెండు నిముషాలు వేయించుకోండి.
2. మరమరాలు పక్కకు తీసుకుని, అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని, కార్న్ ఫ్లేక్స్ ను వేయించుకుని, పక్కకు పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే బాండీలో పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలి.
4. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని వేయించుకున్న మరమరాలు , కార్న్ ఫ్లేక్స్, పల్లీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టామాటా ముక్కలు, తురిమిన క్యారెట్, సరిపడా సాల్ట్, జీలకర్ర, ధనియాల పొడి, కారం , ఉప్పు, చాట్ మసాల, ఆలు సేవ్,దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తమీర, ముందుగా వెయించిపెట్టుకుని పల్లీలు వేసి అన్ని కలిసేలా బాగా కలుపుకోండి.
5. కలుపుకున్న ఈ ముంత మసాలాలో, నెయ్యి వేసుకుని మరోసారి కలుపుకుంటే ముంత మసాల రెడీ.


