Healthhealth tips in telugu

Weight Loss Drink:శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా రోగనిరోధకశక్తి పెరుగుతుంది

Weight Loss Drink:శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరగటమే కాకుండా రోగనిరోధకశక్తి పెరుగుతుంది.. ఈ రోజుల్లో అధిక బరువు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్య నుంచి బయట పడటానికి మనం చాలా సులభంగా ఇంటి చిట్కాల ద్వారా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారం తింటూ ప్రతిరోజు అరగంట వ్యాయామం లేదా యోగ వంటివి చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే 15 రోజుల్లోనే తేడా గమనించి చాలా ఆశ్చర్యపోతారు.

తులసి, మిరియాలు అనేవి బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి, వీటిలో ఉన్న ఔషధ గుణాలు బరువును తగ్గించడమే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఈ సీజన్లో వచ్చే గొంతు నొప్పి, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. తులసి, మిరియాలు చాలా తక్కువ సమయంలో బరువు తగ్గించడానికి సహాయపడతాయి.

తులసి,మిరియాలను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. తులసి, మిరియాలు రెండింటిలోనూ విటమిన్ సి, కె, ఏ, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
corona kashayalu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 10 తులసి ఆకులు, నాలుగు మిరియాలు గింజలను దంచి వేయాలి. ఐదు నిమిషాల పాటు మరిగించి వడగట్టి ఆ నీటిని తాగాలి. దీనిలో రుచి కోసం అవసరమైతే తేనెను కూడా కలుపుకోవచ్చు. ప్రతిరోజు తాగడం వలన జీర్ణక్రియను వేగవంతం చేసి క్యాలరీలు వేగంగా ఖర్చు అయ్యి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.

శరీరంలో మలినాలను తొలగిస్తుంది. ఈ డ్రింక్ ప్రతి రోజు తాగితే బరువు తగ్గటమే కాకుండా ఈ సీజన్ లో వచ్చే ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. తులసి, మిరియాలు రెండింటినీ మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తాం. కాబట్టి మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. అయితే కాస్త శ్రద్ద,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.