Healthhealth tips in telugu

Rice Water Benefits : బియ్యం కడిగిన నీళ్లతో ఇన్ని ప్రయోజనాలా..!

Rice Water Benefits : బియ్యం కడిగిన నీళ్లతో ఇన్ని ప్రయోజనాలా.. సాధారణంగా చాలా మంది బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోయటమో లేదా పశువులకు త్రాగించటమో చేస్తూ ఉంటారు. అయితే నిపుణులు మాత్రం ఈ నీటిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. వాటిపై ఒక లుక్ వేద్దాం.

మొటిమలతో బాధ పడేవారు బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని తరచుగా శుభ్రం చేసుకుంటే మొటిమలు తగ్గటమే కాకుండా ముఖం అందం కూడా పెరుగుతుంది.

అయితే బియ్యం కడిగిన నీటితో నేరుగా ముఖాన్ని కడగకూడదు. ఆ నీటిలో టిష్యు పేపర్ ముంచి ముఖానికి అప్లై చేయాలి.
Rice Water Benefits
ఈ నీటిలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌ చర్మానికే కాకుండా, జట్టుకు కూడా అదనపు బలాన్ని ఇస్తాయి.

ఈ నీళ్లు హెయిర్‌ కండీషనర్‌గా పనిచేస్తాయి. ఈ నీటిలో కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌, లావెండర్‌ ఆయిల్‌ వేసి కలిపి తలకు పట్టించి 15 నిమిషాల తర్వాత తలా స్నానము చేయాలి.

చర్మంపై రాషెస్‌ ఉన్నప్పుడు ఈ నీటితో ముఖాన్ని కడిగితే మంచి ఫలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.