Brahmanandam Son:బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నెల సంపాదన ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..
Brahmanandam Son:బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నెల సంపాదన ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే..మన తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్రహ్మానందం కోసమే థియేటర్స్ కి ప్రేక్షకులు క్యూ కట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన చంటబ్బాయి సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు బ్రహ్మానందం.
ఆ తర్వాత ఆహనా పెళ్ళంట సినిమాలో బ్రహ్మానందం కి మంచి పాత్ర రావడంతో.. ఇక వెనక్కి తిరిగి చూసుకోకుండానే ముందుకు సాగాడు. చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగి ఒకానొక దశలో సంవత్సరానికి 50 సినిమాలు చేశాడు. దాదాపుగా 1000 సినిమాలకు పైగా నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వర్డ్ రికార్డ్ సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
అయితే బ్రహ్మానందం కొడుకు గౌతమ్ కూడా సినీ పరిశ్రమకు పల్లకిలో పెళ్లికూతురు అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు. గౌతమ్ ఇప్పటివరకు ఆరు సినిమాల్లో నటించాడు. లేటెస్ట్ గా బ్రేక్ అవుట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అయితే గౌతమ్ కి సినిమాలనేవి కెరీర్ అసలు కానే కాదట. సరదాగా మాత్రమే సినిమాలను చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎన్నో బిజినెస్ లు ఉన్నాయి. వాటిని చూసుకుంటూ ఖాళీగా ఉన్న సమయంలో సరదాగా సినిమాలను చేస్తూ ఉంటాడు.
హైదరాబాద్ లో ఈయనకి ఎన్నో కమర్షియల్ కంప్లెక్స్ లు మరియు ప్రముఖ MNC కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయట. అలాగే బెంగళూరు లో ఈయనకి చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, అలా నెల మొత్తానికి కలిపితే ఈ సంపాదన 30 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా.
సంవత్సరానికి రూ.360 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తెలుగులో స్టార్ హీరోలుగా చెలామణి అవుతున్న ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు గౌతమ్ కంటే వెనకబడ్డారు. వారి ఆదాయానికి, గౌతమ్ ఆదాయానికి అసలు పోలికే లేదు. ఈ విషయం తెలుసుకున్నవారంతా షాక్ కు గురవుతున్నారు.
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK