Beauty Tips

Hair Fall Tips:వారంలో ఒక్క‌సారి ఈ స్ప్రేను వాడితే హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుంది..

Hair Fall Tips:వారంలో ఒక్క‌సారి ఈ స్ప్రేను వాడితే హెయిర్ గ్రోత్ రెట్టింపు అవుతుంది.. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.

మనలో చాలా మంది మారిన జీవనశైలి మరియు సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలడం, చుండ్రు, స్ప్లిట్ , పొడిబారిన జుట్టు, బట్టతల వంటి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.

చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే ఇంగ్రిడియన్స్ ని ఉపయోగించి సులభంగా తగ్గించుకోవచ్చు. రెండు స్పూన్ల మెంతులను నీటిని పోసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు మెంతుల నీటిని వడకట్టాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని తొక్క తీసి తురిమి రసం తీయాలి. ఒక బౌల్ లో ఉల్లిపాయ రసం,మెంతుల నీరు, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి.
fenugreek seeds
ఈ నీటిని స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా స్ప్రే చేయాలి. అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
hair fall tips in telugu
ఉల్లిపాయ,మెంతులు, ఆముదం ఈ మూడు జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి వాటిలో ఉన్న లక్షణాలు సహాయ పడతాయి. వీటిని పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఈ మూడు మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."