Devotional

Hindu Tradition: పూర్వం గడపకు పసుపు, కుంకుమతో పూజ చేసి.. రోజులో పనిని మొదలు పెట్టేవారు ఎందుకంటే..

Hindu Tradition: పూర్వం గడపకు పసుపు, కుంకుమతో పూజ చేసి.. రోజులో పనిని మొదలు పెట్టేవారు ఎందుకంటే… Hindu Tradition: ఇప్పుడంటే గడపల్లేని ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ.. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ గడప లేని ఇల్లేలేదు.. గడపని శ్రీమహాలక్ష్మి(Sri maha lakshmi)గా భావించేవారు.

సాధారణంగా ఒక ఊరిలో జనాభా గురించి తెలుసుకోవలసి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఎన్ని గడపలు వున్నాయనే ప్రస్తావన రావడం మనం తరచుగా చూస్తూనే వుంటాం. అంటే గడపలేని ఇల్లు ఉండదని మనకి ఈ విషయం తెలియజేస్తుంది.

మన పూర్వికులు భూమికి, ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు.గడప శ్రీ మహాలక్ష్మీ స్థానం అందుకనే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉండటం మనకు అనాదిగా ఆచారంగా వస్తోంది. ఇక ఈ పని చేయకుండా ఏ ఇంట్లోను ఏ శుభకార్యం గానీ, పూజా కార్యక్రమంగాని జరగదు.

గడపను అమ్మవారి స్థానంగా భావిస్తోన్న కారణంగానే గడపను తొక్కడాన్ని,గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు. గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే, రెండవది ప్రాణరక్షణ అని చెప్ప వచ్చు.

సాధారణంగా పల్లెటూళ్లు పంటపొలాల మధ్యలోనో, అడవులకు సమీపంలోనో ఉంటూ వుంటాయి. ఈ కారణంగా ఇళ్లలోకి పాములు, తేళ్లు వంటి విష జంతువులు వస్తూ వుంటాయి. ఇవి పసుపు ఘాటును భరించలేవు కనుక ఆ దరిదాపుల్లోకి రాలేవు. అందువల్లనే గడపలకి పసుపు రాయడం ఆనవాయతీగా వచ్చిందని అంటుంటారు.

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/4bkuwfK

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."