Beauty Tips

Hair Care Tips:జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,బలంగా,ఆరోగ్యంగా పెరుగుతుంది

Hair Care Tips:జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,బలంగా,ఆరోగ్యంగా పెరుగుతుంది.. జుట్టు అందంగా పొడవుగా,ఒత్తుగా ఉండాలని కోరుకోవటం సహజమే. మారిన పరిస్థితుల కారణంగా జుట్టు రాలే సమస్య వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. కాస్త ఓపిక,సమయం కేటాయిస్తే సరిపోతుంది.

పొయ్యి మీద గిన్నె పెట్టి నీటిని పోసి 2 స్పూన్ల బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఒక బౌల్ లో నీటిని పోసి ఒక స్పూన్ ఆవిసే గింజలను వేసి రెండు గంటల పాటు అలా వదిలేస్తే జెల్ తయారవుతుంది. ఈ జెల్ ని వడకట్టి పక్కన పెట్టాలి. ఒక మిక్సీ జార్ లో అన్నం, ఆవిసే గింజల జెల్,ఒక స్పూన్ అలెవెరా జెల్ వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
Flax seeds
ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. బియ్యంలో ఉండే ఆమినో యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."