Haircare Tips: మీ జుట్టు పట్టుకుంటే.. రాలుతోందా.. కలబందతో ఇలా చెక్ పెట్టండి..
Haircare Tips: మీ జుట్టు పట్టుకుంటే.. రాలుతోందా.. కలబందతో ఇలా చెక్ పెట్టండి.. గతంలో వయసు మళ్ళిన వారిలో మాత్రమే జుట్టు రాలడం సమస్య ఉండేది. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయసు లేని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తోంది. ఆహారంలో మార్పులు, కాలుష్యం వలన జుట్టు రాలిపోతోంది. దీని ఫలితంగా యువత బట్టతల సమస్యతో బాధపడుతున్నారు.
జుట్టు రాలడం సమస్య మొదలైనప్పుడు, చాలామంది వివిధ రకాల ఆయిల్స్ మరియు షాంపూలను వాడుతుంటారు. కానీ కొన్ని షాంపూలు జుట్టు రాలడం సమస్యను ఇంకా పెంచవచ్చు. జుట్టు రాలడం మొదలైతే, అనేకమంది డిప్రెషన్‌కు గురి అవుతారు. ఇది సమస్యను మరింత పెంచుతుంది.
అయితే సహజ చిట్కాలను అనుసరించడం ద్వారా జుట్టు రాలడం నుండి బయటపడవచ్చు. అందులో కలబంద ఒక ఉత్తమ ఎంపిక. మరి అలోవెరాతో జుట్టు రాలడం సమస్యను ఎలా అరికట్టాలో ఇప్పుడు చూద్దాం.
మొదట అలోవెరా నుండి జెల్‌ను తీసుకోవాలి. ఆ తర్వాత జెల్‌ను జుట్టుకు మరియు తలకు అప్లై చేసి, ఒక గంట పాటు వదిలేయాలి. అనంతరం సాధారణ గాఢత గల షాంపూతో శుభ్రపరచాలి. ఈ ప్రక్రియను పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. అలోవెరా జెల్‌ను తరచుగా వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు, చుండ్రు, దురద మరియు ఇతర తల చర్మ సమస్యలు తగ్గుతాయి.
అలోవెరా జెల్ ఒక ఉత్తమ యాంటీ-ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేసి తల చర్మంపై సమస్యలను తగ్గిస్తుంది.తల పొడిగా ఉండటం వలన చుండ్రు సమస్య పెరిగి, క్రమంగా జుట్టు రాలిపోవచ్చు. ఆలోవేరా జెల్‌ను వాడితే తల తేమగా ఉండి, జుట్టులో అదనపు నూనెను తగ్గిస్తుంది. ఇది జుట్టును లోపలి నుంచి శుభ్రపరచి పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ