MoviesTollywood news in telugu

Pilla Zamindar Movie: నాని హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా..?

Pilla Zamindar Movie heroine:హరిప్రియ తన సినీ కెరీర్‌లో తెలుగులో కొన్ని గుర్తింపు పొందిన చిత్రాల్లో నటించి, తరువాత కన్నడలో స్టార్ హీరోయిన్‌గా మారింది. ముఖ్యంగా “పిల్ల జమీందార్” చిత్రంలో తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత “జై సింహా” సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించటం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పవచ్చు.

ఇక కన్నడ పరిశ్రమలో హరిప్రియ మంచి స్థానం సంపాదించుకోగా, స్టార్ హీరోలతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించింది. హరిప్రియ 2023లో ప్రముఖ నటుడు వశిష్తను ప్రేమ వివాహం చేసుకోవడం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. వశిష్ట కూడా తెలుగులో “నారప్ప”, “నయీం డైరీస్”, “ఓదెల రైల్వే స్టేషన్” వంటి చిత్రాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు హరిప్రియ కాస్త బొద్దుగా మారిందని నెటిజన్లు ఆశ్చర్యపోయినా, ఆమె కెరీర్‌లో చేసిన ప్రయాణం అభిమానులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా కుటుంబంతో గడుపుతుంది.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ