Beauty Tips

Hair Care Tips:ఈ నూనెను 30 రోజులు వాడితే చాలు.. జుట్టు రాలకుండా నల్లగా పెరుగుతుంది

Hair Care Tips:ఈ నూనెను 30 రోజులు వాడితే చాలు.. జుట్టు రాలకుండా నల్లగా పెరుగుతుంది.. జుట్టు రాలే సమస్య ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు చెప్పే నూనె వాడితే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటమే కాకుండా జుట్టు నల్లగా ఉంటుంది.

ఒక గాజు సీసాలో జటామాన్సి పొడి, ఆముదం, కొబ్బరి నూనె వేయాలి. తరువాత గాజుసీసా ను గుడ్డతో కప్పి దాని మీద గాజు సీసా మూత బిగించాలి. ఈ గాజు సీసా ను 2-3 రోజులు ఎండలో ఉంచాలి. 2-3 రోజులు ఎండలో ఉంచిన తరువాత దాన్ని 5-7 రోజులు ఒక చీకటి ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే జటామాన్సి ఆయిల్ సిద్దమైనట్టే.

ఈ నూనెను తలస్నానం చేయడానికి 30 నిమిషాల ముందు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. పగటి సమయంలో కుదరని వారు రాత్రి సమయంలో జుట్టుకు ఈ నూనె పెట్టుకుని షవర్ cap పెట్టుకొని రాత్రంతా అలాగే ఉంచి ఆ తరువాత ఉదయాన్నే తలస్నానం చేయాలి. ఈ విధంగా 30 రోజులు దీన్ని ఉపయోగిస్తే మంచి పలితాలను పొందవచ్చు.

జటామాన్సి ఆయిల్ జుట్టులో మెలనిన్ ఉత్పత్తిని పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. జుట్టు కుదుళ్ల నుండి దృఢంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఈ నూనె మానసిక ఒత్తిడిని తగ్గించి మనస్సుకు హాయిని ఇస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ