Beauty Tips

Grey Hair Problem:తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి నాచురల్ చిట్కా

Grey Hair Problem:తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి నాచురల్ చిట్కా.. తెల్లజుట్టు సమస్యను ఇంటి చిట్కాల ద్వారా పరిష్కారం చేయవచ్చు. మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను అసలు వాడవలసిన అవసరం లేదు.

తెల్ల జుట్టు సమస్య అనేది ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయినా పెద్దగా పలితాన్ని ఇవ్వకపోవటంతో నిరాశకు గురి అవుతూ ఉంటారు.

అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి పలితాన్ని పొందవచ్చు. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

మందార ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

పొయ్యి మీద పాన్ పెట్టి ఆముదం వేసి దానిలో హెన్నా పొడి వేసి బాగా కలిపి బాగా వేడి చేయాలి. ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే జుట్టుకి పట్టించి గంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

కాఫీ పౌడర్ కూడా తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా తరిమి కొడుతుంది.ఓ గ్లాసుడు నీళ్లలో కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి.వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి.ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."