Ayurveda Laddu: రక్తహీనతతో బాధపడుతున్నారా.. మెడిసిన్స్ బదులు ఈ లడ్డు తిని చూడండి..
Ayurveda Laddu: రక్తహీనతతో బాధపడుతున్నారా.. మెడిసిన్స్ బదులు ఈ లడ్డు తిని చూడండి.. ఏ చిన్న పని చేసినా అలసటగా అనిపించడం, కొంచెం దూరం నడవగానే ఆయాసం, నీరసం రావడం ఇవన్నీ శరీరంలో తగినంత రక్తం లేకపోతే జరుగుతుంటాయి. బాడీకి కావలసిన ఐరన్ సమపాళ్లలో లేనప్పుడు రక్తహీనత సంభవిస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్నారు. అన్నిటికీ టాబ్లెట్లు వాడే బదులు ఇంట్లోనే ఐరన్ సంబంధిత పదార్థాల ద్వారా బ్లడ్ లెవల్స్ పెంచుకునే విధానం ఆయుర్వేదంలో సహజ పద్ధతుల్లో చెప్పబడింది. రక్తహీనతను తగ్గించి.. రోగనిరోధక శక్తిని పెంచే వాల్ నట్స్, తెల్ల నువ్వులు బెల్లం తో చేసిన లడ్డు తయారీ తెలుసుకుందాం..
దీనికోసం వాల్ నట్స్ తీసుకోవాలి వాల్ నట్స్ లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. నువ్వులలో తెల్ల నువ్వులను తీసుకోవాలి.తెల్ల నువ్వులలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇక ఆ తర్వాత బెల్లం కూడా తీసుకోవాలి.బెల్లంలో కూడా ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఒక అరకప్పు వాల్నట్స్ అరకప్పు నువ్వులు తీసుకొని మెత్తని పొడిగా చేసుకోవాలి.
ఈ పొడిలో అర కప్పు బెల్లం తురుము వేసి మూడు కలిపి కొంచెం ఆవు నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకొని ప్రతిరోజు ఒకటి తింటూ ఉండాలి ఈ విధంగా ప్రతి రోజు ఒక లడ్డూ తింటూ ఉంటే తగ్గి రక్తహీనత సమస్య తొలగిపోతుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి.
ఈ లడ్డు రక్తహీనత సమస్యలు తగ్గించడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పిల్లలలో ఎదుగుదల బాగుంటుంది. అలాగే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అలసట,నీరసం,నిసత్తువ వంటివి అన్నీ తొలగిపోయి చురుకుగా,ఉషారుగా ఉంటారు. ఈ లడ్డులను ఒకసారి చేసుకొని 10 రోజుల పాటు తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

