Beauty Tips

Face Glow Tips:బ్యూటీపార్లర్ వెళ్లే పనిలేకుండానే ఇంట్లోనే మీ ఫేస్ తెల్లగా గ్లో అవ్వాలంటే..

Face Glow Tips:బ్యూటీపార్లర్ వెళ్లే పనిలేకుండానే ఇంట్లోనే మీ ఫేస్ తెల్లగా గ్లో అవ్వాలంటే.. ప్రతి స్త్రీ అందమైన, శుభ్రమైన మరియు మెరిసే చర్మాన్ని కోరుకుంటుంది, దీని కోసం మహిళలు అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. సెలూన్ల నుండి అనేక సౌందర్య సాధనాలు ఉపయోగించబడతాయి.

ఇవి రసాయనాలను కలిగి ఉన్నందున చర్మానికి చాలా హాని కలిగిస్తాయి. మీరు మీ చర్మ సంరక్షణలో వంటగది ఉత్పత్తులను ఉపయోగిస్తే, మీరు మీ చర్మాన్ని మరింత మెరుగ్గా మరియు మరింత అందంగా మార్చుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం మీద శ్రద్ద పెడుతున్నారు. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా అందంగా కాంతివంతంగా మెరవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండా ఇంటిలోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. Tomato సహజసిద్దమైన టోనర్ గా పనిచేస్తుంది. టమాటాను మెత్తని పేస్ట్ గా చేసి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా చేస్తే చర్మంపై పెద్దగా కనిపించే రంధ్రాలు మూసుకుపోతాయి. మొటిమలు, నల్లని మచ్చలు తొలగిపోతాయి. టమాటా పేస్ట్ లో పుదీనా రసం కలిపి రాస్తే ఇంకా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. చర్మానికి సంబంధించిన పలు రకాల సమస్యలను నయం చేస్తుంది.

ఒక టేబుల్‌స్పూన్‌ పసుపులో సరిపడా పాలు పోసి పేస్ట్‌లా చేయాలి. ముఖం, మెడ భాగాలకు ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ రాసుకుంటే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. మచ్చలు కూడా మటుమాయం అవుతాయి.

పొడిబారిన చర్మానికి ఒక టీస్పూన్‌ పసుపు, రెండు టీస్పూన్ల గంధం పొడి, సరిపడా నీళ్లు (రోజ్‌ వాటర్‌ అయినా వాడొచ్చు) కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా ఆరనివ్వాలి. వారానికి రెండుసార్లు ఈ మాస్క్‌ వేసుకుంటే బాగుంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."