Boda kakarakaya: చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్న కూరగాయ ఇదే..
Boda kakarakaya: చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్న కూరగాయ ఇదే.. ప్రస్తుతం రెయినీ సీజన్‌లో కొన్నిరకాలు పండ్లు, కూరగాయలు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. వాటిల్లో ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనం చేకూర్చేది బోడకాకరకాయ.
దీన్ని కొన్ని ప్రాంతాల్లో ‘ఆకాకరకాయ, బొంత కాకరకాయ అని కూడా పిలుస్తారు. బోడకాకరతో.. పులుసు, వేపుడు కూర, పొడి చేసుకుని.. ఇష్టంగా తింటుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ఏ సీజన్ లో వచ్చే కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ సీజన్ లో ఆకాకరకాయ లేదా బోడకాకరకాయ చాలా విరివిగా దొరుకుతున్నాయి. ఈ సమయంలో శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుకోవలసిన అవసరం ఉంది.

బోడ కాకరను సాధారణ కూరగాయగానే కాకుండా దీని వేర్లు, పువ్వులు, రసం, ఆకులు మొదలైనవి అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఆకాకరకాయలో ఉన్న ప్రయోజనాలను చూస్తే…వీటిల్లో కేలరీలు తక్కువగా ఉండుట వలన అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది.

దీని గుజ్జు , విత్తనాలలో కరిగే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన గ్యాస్ట్రిక్ అల్సర్, పైల్స్ , మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. యాంటీ అలెర్జీ, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, అనాల్జేసిక్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన శరీరానికి ఎటువంటి సమస్య లేకుండా చేస్తుంది.

సీజన్ మారినప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆకాకర కాయలోని కెరోటెనాయిడ్లు కంటికి సంబందించిన సమస్యలు రాకుండా చేస్తుంది. వీటిలో ఉండే ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి.

దీనిలో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలు, జింక్, పొటాషియం, భాస్వరం మరియు సోడియం పుష్కలంగా ఉన్నాయి. వీటిలో సమృద్ధిగా లభించే ప్లవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. కాబట్టి ఈ ఆకాకరకాయలు దొరికినప్పుడు అసలు మిస్ కాకుండా తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

