Healthhealth tips in telugu

Weight Loss Tips: బరువు తగ్గడానికి రోజుకు ఎన్ని చపాతీలు తినాలి?

Weight Loss Tips: బరువు తగ్గడానికి రోజుకు ఎన్ని చపాతీలు తినాలి.. గోధుమ పిండితో తయారు చేసిన చపాతీ భారతీయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. చాలా మంది చపాతీని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు.

బరువు పెరగడం లేదా తగ్గడం విషయానికి వస్తే.. గోధుమ రొట్టె వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే ప్రశ్న తరచుగా ప్రజల మనస్సులో తలెత్తుతుంది. ఇది బరువును పెంచుతుందా లేదా బరువు తగ్గడంలో సహాయపడుతుందా..?

గోధుమ పిండి రోటీలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్ మరియు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది సమతుల్య ఆహారంలో భాగం అవుతుంది. కానీ అధికంగా తింటే లేదా ఇతర అధిక కేలరీల ఆహారాలతో కలిపి తినడం వల్ల బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

మనలో చాలా మంది బరువు తగ్గటం కోసం చేసే ప్రయత్నాలలో మొదటిది చపాతీ తినడం. అయితే చపాతీ పరిమాణం చపాతీ తినే సమయం కూడా మన బరువు మీద ప్రభావం చూపుతుంది. బరువు తగ్గే ప్రణాళికలో ఉన్నవారు చపాతి తినే సమయంలో ముఖ్యంగా చపాతి పరిమాణంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి.. బరువు తగ్గే సమయంలో మహిళలు 1400 క్యాలరీలు తీసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో వారు ఉదయం రెండు చపాతీలు సాయంత్రం రెండు చపాతీలు తింటే సరిపోతుంది.

అలాగే పురుషుల విషయానికొస్తే బరువు తగ్గటానికి వారు 1700 క్యాలరీలు మాత్రమే తినాలి. అటువంటి పరిస్థితుల్లో ఉదయం 3 సాయంత్రం 3 చపాతీలను తినవచ్చు. ఇంకా ఆకలి ఎక్కువగా అనిపిస్తే గోధుమపిండి చపాతీకి బదులు జొన్న, రాగి పిండిలతో రొట్టెలను తయారు చేసుకొని తినవచ్చు. జొన్న పిండి అయితే క్యాలరీలు తక్కువగాను గ్లుటేన్ రహితంగా ఉంటుంది.
weight loss
అలాగే పైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి గోధుమపిండికి బదులుగా జొన్న పిండిని వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. రాత్రి సమయంలో చపాతీ తిన్నా తర్వాత తప్పనిసరిగా వాకింగ్ చేయాలి. ఎందుకంటే చపాతి తిన్నా వెంటనే పడుకుంటే జీర్ణ క్రియలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Click Here To Follow Chaipakodi On Google News