Face Care Tips:నల్ల ద్రాక్షతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ఏమవుతుందో తెలుసా?
Grapes Face Glow Tips: చర్మ సంరక్షణకు వీటిని స్క్రబ్ ,మాయిశ్ఛరైజర్ తయారీలో ఉపయోగిస్తారు. తాజా ద్రాక్షలను గుజ్జుగా మార్చి మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష ఏదైనా సరే సౌందర్య పోషణలో కీలక పాత్ర పోషిస్తాయని సౌందర్య నిపుణులు చెప్తున్నారు.
ముఖం అందంగా తెల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
కొన్ని ద్రాక్ష పళ్ళను తీసుకోని మెత్తగా గ్రైండ్ చేసుకొని దానికి రెండు స్పూన్ల ముల్టాన మట్టిని కలపాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా రోజ్ వాటర్,మూడు చుక్కల నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ని ముఖానికి,మెడకు బాగా పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని,మెడను కడిగి మాయీ శ్చరైజర్ రాసుకోవాలి.
ద్రాక్ష గుజ్జుకి ఒక స్పూన్ పుదినా పేస్ట్,ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ లో కొంచెం రోజ్ వాటర్ వేసి దానిలో ఒక ఐస్ క్యూబ్ వేసి, ఫేస్ ప్యాక్ తీసిన వెంటనే ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే,ముఖంపై అధికంగా ఉన్న జిడ్డు తొలగిపోతుంది.
రెండు స్పూన్ల ద్రాక్ష గుజ్జుకు ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు,ఒక స్పూన్ తేనే కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ద్రాక్షలో ఉండే సహజ ఆమ్లాలు,విటమిన్స్ చర్మానికి కొత్త కాంతిని అందిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News

