Hair care Tips:ఆయిల్ రాసినా మీ జుట్టు గడ్డిలా ఎండిపోతోందా? – ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి!
Hair Care Tips:ఆయిల్ రాసినా మీ జుట్టు గడ్డిలా ఎండిపోతోందా? – ఈ టిప్స్‌తో చెక్ పెట్టండి.. కొందరు ఎంత నూనె పెట్టినా జుట్టు పొడిగా మారుతుంది. గడ్డిలా ఎండిపోతుంది. చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇలాంటి ప్రాబ్లమ్‌తో ఇబ్బందిపడుతున్నారా? అయితే ఈ టిప్స్‌తో ఈజీగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సమస్య వచ్చినప్పుడు అసలు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు.
రెండు క్యారట్ లను తీసుకోని మెత్తగా ఉడికించాలి. ఆ నీటితో పాటే క్యారట్ ను మెత్తని పేస్ట్ గా చేయాలి. దీనిని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.
రెండు క్యారట్ లను తీసుకోని రసాన్ని తీసి పక్కన పెట్టాలి . ఒక బౌల్ లో రెండు స్పూన్లతేనే,ఒక స్పూన్ ఆలివ్ నూనె,ఒక స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ తీసుకోని కొద్దిగా వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని పైన తయారుచేసుకున్న క్యారట్ రసంలో కలపాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి,రాత్రంతా షవర్ క్యాప్ పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ ప్యాక్ జుట్టును దృడంగా ఉంచుతుంది.
ఒక క్యారట్,ఒక అరటిపండును తీసుకోని చిన్న చిన్న ముక్కలుగా కోసి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News